728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Wednesday, 10 August 2011

నవయువకా లేలేరా శత్రుసేన మాతృభూమి నుండి పారద్రోలరా - Vijaya Vipanchi



నవయువకా లేలేరా శత్రుసేన మాతృభూమి నుండి పారద్రోలరా
విజయ ధ్వజము గగన సీమ నేగురవేయరమ్మురా ||నవ||


శత్రుమూక దండయాత్ర చేయదోయి ప్రతి దినం
కారుమబ్బులాకసాన క్రమ్మవోయి ప్రతి క్షణం
హిమధరాధరమ్ము పిలుపునీయదోయి నిత్యము
సమయమొచ్చే సమరమొచ్చే సాహసంబు చూపరా ||నవ||


సాహసాన సంగరాన శత్రుమూక దునుమగా
కృతఘ్నులన్ శతఘ్నితోడ ప్రేల్చి కాల్చి వేయరా
పరుల పాలబడిన భూమి మరల ముక్తినొందగా
రాష్ట్ర దేహమందు నూత్న రక్తదీప్తి నింపరా ||నవ||


తరుణమందు సర్వశక్తి ధారవోయి వలెనురా
తల్లి ఋణము దీర్చువాడే తనయులందు ఘనుడురా
శీర్షమైన కోసియిచ్చు శక్తి పౌరుషంబులన్
కదనభేరి ధ్వనులతోడ ప్రళయ నృత్య మాడరా ||నవ||

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: నవయువకా లేలేరా శత్రుసేన మాతృభూమి నుండి పారద్రోలరా - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh