728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 28 October 2013

కోచి: పూర్తైన RSS అఖిల భారతీయ కార్యకారణి మండల్ సమావేశాలు, రెండు తీర్మానాలు ఆమోదం - పాట్నా ఘటన పై తీవ్ర ఖండన

కోచి 27/10/2013 : అఖిల భారతీయ కార్యకారణి మండల్ బైఠక్ గ పిలిచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అత్యున్నత నిర్ణాయక స్థాయి సమావేశాలు తేది 25-Oct-2013 నుండి 27-Oct-2013 వరకు కేరళ రాష్ట్రము కొచ్చిలోని ప్రాంత ముఖ్య కార్యాలయం ' భాస్కరీయం ' లో జరిగాయి , ఈ స్థాయి సమావేశాలు కేరళలో జరగటం ఇదే మొదటిసారి, 
ఈ సమావేశాలు రెండు ముక్య మైన తీర్మానాలను ఆమోదించాయి :

  1. దక్షిణ భారత దేశం లో పెట్రేగుతున్న జీహది తీవ్రవాదం Cilck Here to Download in pdf 
  2. దేశ సరిహద్దులు దురాక్రమణను గురికాకుండా తక్షణ చర్యలు Cilck Here to Download in pdf 

(సాధ్యమైనంత త్వరలో రెండు తీర్మానాల తెలుగు ప్రతులను అందిస్తాం ) 



ఈ సమావేశాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ స్థాయి జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు , ప్రస్తుతం పంజాబ్ ప్రాంతానికి సహా ప్రాంత ప్రచారుకులు గా భాద్యతలు నిర్వహిస్తున్న మాన్య శ్రీ సతీష్ గారు ఇక పై స్వదేశీ జాగరణ్ మంచ్ లో బాధ్యతలు నిర్వహిస్తారు , మాన్య శ్రీ రాజపాల్ సింగ్ గారు ఉత్తర్ ప్రదేష్ లోని బృజ్ ప్రాంతానికి సహా కార్యవాహ గా నియుక్తులయ్యారు .
సమావేశాల అంశాలను మీడియాకు తెలుపుతున్న మాన్య మన్మోహన్ వైద్యఅఖిల భారతీయ ప్రచార్ ప్రాముఖ్  

మూడు రోజులుగా జరిగిన ఈ సమావేశాలకు సంఘ్ జాతీయ న్యాయకత్వం తో పాటు సంఘ పరివార్ సంస్థల నాయకులు పాల్గొన్నారు , పూజ్య సర్ సంఘ్ చాలకులు మాన్య శ్రీ మోహన్ జి భగవత్ గారు , మరియు మాన్య శ్రీ సురేష్ (భయ్యాజి) జ్యోషి గారు మార్గదర్శం చేసారు .    

పాట్న వరుస పేలుళ్ళ ను తీవ్రంగా ఖండిస్తున్నాం 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రాముఖ్ మాన్య శ్రీ మన్మోహన్ వైద్య గారు మీడియా తో మాట్లాడుతూ ' జాతీయవాద శక్తులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నా దాడుల పట్ల అఖిల భారతీయ కార్యకారణి మండల్ తీవ్ర  దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది , తీవ్రవాదులు ఇలాంటి దాడులతో జాతీయవాదుల ఆత్మా స్తైర్యాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేరు , ఇలాంటి దాడులు ఇకముందు జరుగకుండా ప్రభుత్వం చట్టాలను అమలుపరచాలి ' అని అన్నారు 

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: కోచి: పూర్తైన RSS అఖిల భారతీయ కార్యకారణి మండల్ సమావేశాలు, రెండు తీర్మానాలు ఆమోదం - పాట్నా ఘటన పై తీవ్ర ఖండన Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh