Reported by : శ్రీ చంద కిరణ్ ( రాస్త్రచేతన ప్రతినిధి - మంచిర్యాల్ )
![]() |
కార్యక్రమంలో మార్గదర్శనం చేస్తున్న శ్రీ ఆకారపు కేశవరాజు |
మంచిర్యాల్ , 11/04/2013 : విశ్వ హిందు పరిషద్ మంచిర్యాల్ జిల్లా శాఖా ఆధ్వర్యంలో ఉగాది నుండి ఉగాది దిన దర్శని ( కాలెండర్ ) ఆవిష్కరణ కార్యక్రమం మరియు శ్రీ రామ నామ జప యజ్ఞ సంకల్ప కార్యక్రమం జరిగింది , ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా శ్రీ ఆకారపు కేశవ రాజు ప్రాంత సంఘటన మంత్రి విహిప , మరియు ముఖ్య అదితి గా శ్రీ పంచాక్షరి( జూనియర్ సివిల్ జడ్జి , మంచిర్యాల్ ) గారు , శ్రీ భద్రి నారాయణ గారి ( జిల్లా సంఘచలాక్ ) గారు హాజరయ్యారు ,
ఈ కార్యక్రమములో శ్రీ ఆకారపు కేశవరాజు గారు మార్గదర్శనం చేస్తూ కాల గణనలో భారతీయులు ప్రపంచానికి అందనంత స్థాయిలో ఉన్నారని , సేకనులోను 35,000 వ భాగాన్ని కూడా గణించే స్థాయి భారతీయ జ్యోతిష్య శాస్త్రానిదని , చిర పురాతనము - నిత్య నూతనము అయిన హైందవ ధర్మ పరిరక్షణ మన ధ్యేయం కావాలని అన్నారు , ఉగాది నుండి ఉగాది వరకు చూపించే దిన దర్శని అందరు ఉపయోగించాలని ఆయన పిలుపు నిచ్చారు
,
0 comments:
Post a Comment