728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Thursday, 29 August 2013

నా పై అక్రమ కేసు వెనుక సోనియా, రాహుల్ హస్తం : అసారాం బాపు

  • గత నాలుగున్నర ఏళ్లుగా మత మార్పిడ్ల వెనుక ఉన్న వారికి మద్దతు లభిస్తుంది .
  • మేడమ్ , ఆమే కుమారుడి కారణంగానే ఇదంతా జరుగుతుంది 
  

భోపాల్, ఆగస్టు 29: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రోద్బలంతోనే తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకొంటున్న ఆశారామ్ బాపు గురువారం ఆరోపించారు. ‘నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. అయితే మేడమ్, ఆమె కుమారుడి కారణంగానే ఇదంతా జరిగిందని జనం నాతో చెప్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా మత మార్పిడుల వెనుక ఉన్నవారికి వారి మద్దతు లభిస్తోంది’ అని సోనియా గాంధీ, రాహుల్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా ఆయన విలేఖరులతో అన్నారు. ఆశారామ్ బాపు తనపై సెక్స్ దాడికి యత్నించారంటూ ఆయన ఆశ్రమంలోని 16 ఏళ్ల యువతి చేసిన ఫిర్యాదుపై శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ పోలీసులు ఆయను సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల ఎదుట హాజరు కావడానికి తాను మరింత సమయం కోరనని ఆశారామ్ చెప్పారు. కాగా, పోలీసుల ఎదుట హాజరు కావడానికి తనకు మరికాస్త సమయం కావాలన్న ఆశారామ్ బాపు అభ్యర్థనపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జోధ్‌పూర్ పోలీసులు బుధవారం చెప్పారు. ‘దీనికి సంబంధించి ఆశారామ్ అభ్యర్థన మాకు ఇంకా అందలేదు. ఈ దరఖాస్తు పట్టుకుని వస్తున్న బృందం ఇంకా జోధ్‌పూర్ చేరుకోలేదు. దాన్ని చూసే దాకా మేము ఏమీ చెప్పలేము’ అని జోధ్‌పూర్ డిసిపి అజయ్ పాల్ లాంబా చెప్పారు.
కాగా, తనను ఒకవేళ జైలుకు పంపితే అక్కడ తాను నిరాహారదీక్ష ప్రారంభిస్తానని, కుట్రలో భాగంగా తనకు పెట్టే ఆహారాన్ని తాను నమ్మజాలనని ఆశారామ్ చెప్పారు. కాగా మిమ్మల్ని ఎవరైనా కాపాడుతున్నారా అని ప్రశ్నించిన విలేఖరులపై ఆయన మండిపడ్డారు. ‘నన్ను ఎవరూ రక్షించడానికి ప్రయత్నించడం లేదు.. మీరు మాట్లాడుతున్నది తప్పు.. ఏ పార్టీ కూడా నాకు మద్దతుగా నిలవడం లేదు.. మీరు ఆలా మాట్లాడకండి.. నన్ను వేధించకండి’ అని ఆశారామ్ విలేఖరుల సమావేశాన్ని మధ్యలోనే విరమించుకున్నారు. సాయుధ పోలీసులు ఆయనను అక్కడినుంచి తీసుకెళ్లిపోతూ ఉంటే ఆయన మద్దతుదారులు మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: నా పై అక్రమ కేసు వెనుక సోనియా, రాహుల్ హస్తం : అసారాం బాపు Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh