728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Sunday, 17 March 2013

ఘనంగా మంచిర్యాల్ సేవాభారతి ఏకలవ్య ఆవాస వార్షికోత్సవం

Reported By : శ్రీ కిరణ్ గారు ( ప్రతినిధి - రాష్ట్ర చేతన )



మార్గదర్శనం చేస్తున్న శ్రీ వేణు గోపాల్ రెడ్డి గారు 

18/03/2013 , మంచిర్యాల్ : మంచిర్యాల్ నగరములో సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకలవ్య ఆవాసం యొక్క వార్షికోత్సవం తేది 18/03/2013 నాడు సాయత్రం ఆవాస ప్రాంగణంలో నిర్వహించబడినది , గత 23 సంవత్సరాలుగా ఈ ఆవాసం నిర్వహించనడుతున్నది మొత్తం 40 మంది గిరిజనుల, అనాధ  పిల్లలు ఈ ఆవాసంలో ఆశ్రయం పొందుతున్నారు వారికి ఉచిత విద్య , వసతి లతో పాటు సంస్కారాలు అందించడం జరుగుతుంది , ఈ కార్యక్రమానికి శ్రీ విశ్వనాథ్ ( చాటర్డ్ అకౌంటెంట్ ) గారు ముఖ్య అదితి గా ,  శ్రీ వేణు గోపాల్ రెడ్డి గారు ( రా.స్వ.సం ప్రాంత కార్యకారని సదస్యులు ) ముఖ్య వక్త గా హాజరయ్యారు .

వారు మార్గదర్శ్జనం చేస్తూ సమాజం నాకు ఏమి ఇచ్చింది అని కాక సమాజానికి నేను ఏమి ఇవ్వగలను అనే త్యాగాభావన అందరిలోనూ నిర్మాణం కావాలి , అప్పుడే  ప్రామాణిక ఆదర్శ  సమాజ నిర్మాణం సాధ్య్హ మౌతుందని దరిద్ర నారాయణుడుని కొలచిన స్వామీ వివేకానందా పథం మనకందరికీ ఆనుసరనీయమని , వారి శర్ద శతి జయంతోత్సవాల స్పూర్తిగా ప్రతి వ్యక్తీ సమాజ నిర్మాణంలో తన వంతు పాత్ర నిర్వహించాలని అన్నారు . 
విద్యార్థుల ప్రదర్శనలు 
ఈ కార్యక్రమంలో ఆవాస విద్యార్థులు చేసిన అనేక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకర్షించాయి , 
హాజరైన ఆహుతులు , గ్రామ పెద్దలు  
ఈ కార్యక్రమంలో రఘునాథ్ గారు సేవాభారతి ప్రాంత కార్యదర్శి , మాన్య శ్రీ విద్యాసాగర్ రావు ( కరీనగర్ విభాగ్ సంఘ చాలక్ ),  గరిమల్ల భద్రి నారాయణ గారు , ఆవాస ప్రాముక్ శ్రీ బాపు గారు , గ్రామ పెద్దలు  , తదితరులు  వారు పాల్గొన్నారు 
   
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఘనంగా మంచిర్యాల్ సేవాభారతి ఏకలవ్య ఆవాస వార్షికోత్సవం Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh