728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Wednesday, 7 September 2011

సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం - VijayaVipanchi



సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం
భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం  

|| సంఘటనం ||

గలగల పారే  ఆ జలపాతం నిలిచిందా తనకోసం ఏనాడైనా
మిల మిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తనకోసం ఏ క్షణమైనా 
తరతరాలా భారతీయ తాపసులది ఈ మార్గం
ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం   

|| సంఘటనం ||

భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా
ఆజన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా
ఆనామికత సందేశం హైందవ జీవన సారం
జనని జన్మ కారణం జన్మభుమిదీ ఋణం   

|| సంఘటనం ||

మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై
కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై
కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం
జయ జయహే మాతరం జయం జయం భారతం  

|| సంఘటనం ||

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం - VijayaVipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh